ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (17:49 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మంచి శుభవార్తను చెప్పింది. ఈ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 23వ తేదీ నుంచి వచ్చే జనవరి 1 వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది. 
 
ఏకంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. దీనికి సంబంధించిన 2.25 లక్షల టికెట్లు నవంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని కూడా తెలిపింది. 
 
డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది.