శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:12 IST)

తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న చెవిరెడ్డి

తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు.

తుమ్మలగుంట నుంచి కావిడితో చెవిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుత్తణికి బయలుదేరారు. అక్కడ అర్చకులు, ఆలయ అధికారులు చెవిరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చెవిరెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు చెవిరెడ్డి గారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.