గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (10:40 IST)

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు.. ఏపీ పీసీసీ చీఫ్

Mega Star Chiranjeevi,
మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేసేదిశగా రంగం సిద్ధం అవుతుందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెస 26 నుంచి మార్చి 26 వరకు పార్టీ కార్యకర్తలు పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 
 
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే వున్నారని.. ఆయనకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. ఏ పార్టీతో పొత్తు వుండదని క్లారిటీ ఇచ్చారు.