బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (13:44 IST)

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్.. చంద్రబాబు (video)

Chandra babu Naidu
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆయన చైర్‌లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "అధ్యక్షా... తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో మీరు ఒకరు. బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరి ఆమోదంతో, 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు" అంటూ బాబు అన్నారు. 
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు.