గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (20:11 IST)

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

pawan babu
ఆంధ్రప్రశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు శపథం చేసి మరీ గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కొత్త ప్రభుత్వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సభకు వచ్చారు. 
 
అయితే, ఈ సారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల రాకకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నిండు సభలో వైకాపా ఎమ్మెల్యేలు అవమానించారు. దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. తీవ్ర మనస్తాపంతో సభను వీడారు. ఆ రోజున ఇలాంటి కౌరవ సభలో తాను ఉండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని గత 2021 నవంబరు 19వ తేదీన శపథం చేశారు. అనుకున్నట్టుగానే ముగిసి ఎన్నికల్లో ఆయనతో పాటు టీడీపీ కూడా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన సభలో మళ్లీ అడుగుపెట్టి తాను నాడు చేసిన భషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి, నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. ఆ తర్వాత శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు చంద్రబాబుకు అసెంబ్లీ వద్ద ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 
అదేవిధంగా పవన్ కళ్యాణ్‌ కూడా సగర్వంగా సభలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. దీంతో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు పెట్రేగిపోయారు. పవన్‌ను అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. కానీ, 2024 ఎన్నికల్లో వైకాపా ఓటమికి పవన్‌ కళ్యాణ్ ప్రధాన కారకుడయ్యాడు. అంతేనా, ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా ఆయనదే. ప్రాణంపోతున్న టీడీపీకి ఊపిరి పోల్చారు. 151 సీట్లున్న వైకాపాను అధఃపాతాళానికి తొక్కిపడేశాడు. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైకాపా పరిమితమయ్యేలా చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. నాడు అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమంటూ భీకరాలు పలికిన వారంతా ఇపుడు అసెంబ్లీకి అడుగుపెట్టలే ఇళ్లకే పరిమితమయ్యారు.
 
ఇదిలావుంటే, గురువారం మ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌  ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.