సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (21:38 IST)

'నాని'లపై సీఎం జగన్ గురి... నా పేరు 'నాని' అయితే ఎంత బాగుణ్ణో...? ఎవరు?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముగ్గురు నానిలకు చోటు దక్కింది. వాళ్లెవరయ్యా అంటే... కొడాలి నాని (గుడివాడ), ఆళ్ల నాని (ఏలూరు), పేర్ని నాని (మచిలీపట్నం). ఈ ముగ్గురు నానిలకు మంత్రి పదవులు దక్కటంతో తమ పేరు కూడా నాని అయితే ఎంత బావుణ్ణో అని కొందరు వైసీపి ఎమ్మెల్యేలు అనుకున్నారట.
 
ఇకపోతే... నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో మొత్తం 25మందికి చోటు కల్పించారు. వీరిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు. మిగిలిన 20 మంది మంత్రులుగా పని చేస్తారు. 
 
మంత్రులుగా ఎంపికైన వారి వివరాలు...
 
1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
 
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
 
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
 
4. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
 
5. కురసాల శ్రీనివాస్‌(కాకినాడ రూల్‌)
 
6. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
 
7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
 
8. తానేటి వనిత (కొవ్వూరు)
 
9. ఆళ్ల నాని (ఏలూరు)
 
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
 
11. కొడాలి నాని (గుడివాడ)
 
12. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
 
13. పేర్ని నాని (మచిలీపట్నం)
 
14. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)

15. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
 
16. మోపిదేవి వెంకటరమణ
 
17. బాలినేని శ్రీనివాస్‌(ఒంగోలు)
 
18. మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)
 
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు)

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
 
21. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)

22. అంజద్ బాషా (కడప)

23. శంకర్ నారాయణ (పెనుగొండ)

24. బుగ్గన రాజేంద్రనాథ్(డోన్)

25. గుమ్మనూరు జయరాం(ఆలూరు)