తిరుమలలో నాగు పాము హల్ చల్..భక్తులపైకి వెళుతూ..? (video)
తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పాముల ఎక్కువగా భక్తుల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. చలికాలం కావడంతో ఈ మధ్య పాములు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా భక్తులు నడిచివెళ్ళే కాలిబాటమార్గంలో నాగుపాములు ఎక్కువగా తిరుగుతున్నాయి.
ఎన్నిసార్లు పాములు పట్టి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదులుతున్నా మళ్ళీ వచ్చేస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం తిరుమలకు నడిచివెళ్ళే కాలిబాటలో నాగుపాము హల్ చల్ చేసింది. అటవీప్రాంతం నుంచి మెట్లపైకి వచ్చిన నాగుపాము మెట్లపైన బుస్సలు కొడుతూ కనిపించింది.
చాలాసేపటి వరకు మెట్లపైనే తిరిగింది నాగుపాము. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టిటిడిలో ప్రత్యేకంగా పాములు పట్టే భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలికి చేరుకున్నారు. చాకచక్యంగా నాగుపామును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.