బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (09:25 IST)

3 నుంచి మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌

కరోనా కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నామన్నారు. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయన్నారు. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదని, అందరూ కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వారం రోజులపాటు మచిలీపట్నంలోకి రావడానికి గాని, మచిలీపట్నం నుంచి బయటకు వెళ్లడం గాని చేయకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు సంబంధిత సచివాలయంలో నమోదు చేసుకుని వ్యవసాయ పనులకు వెళ్లాలన్నారు.

మచిలీపట్నంలో బక్రీద్ నాడు ముస్లిం సోదరులు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాల వయసున్నవారు, చిన్నపిల్లలు బయటకు రావొద్దన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.