గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (09:06 IST)

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన: ఏపీ ఉద్యోగ సంఘాలు

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు, సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ సహా వివిధ అంశాలపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

సమస్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని సంఘాలు కోరారు.

ఉద్యోగులు దాచుకున్న డబ్బు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. దసరా కానుకగా పీఆర్‌సీ ఇస్తారని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాలు తెలిపారు.

సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.