శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (06:40 IST)

విశాఖలో కరోనా కలకలం.. ఒకే రోజు ఐదు అనుమానిత కేసుల నమోదు

విశాఖలో కరోనా వైరస్ కేసుల కలకలం రేపుతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

వీరంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే. ఓ కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమార్తె కొద్ది కాలం కిందట కౌలాలంపూర్ వెళ్లి, రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వీరు బాధ పడుతున్నట్టు గుర్తించిన విమానాశ్రయ అధికారులు.. వారిని వెంటనే నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ వార్డుకు తరలించారు. 
 
మరోవైపు, గత నెల 28న బహ్రెయిన్ నుంచి విశాఖకు వచ్చిన 23 ఏళ్ల ఓ యువతి, ఆమె స్నేహితుడు కూడా గత రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు.

దీంతో, వీరిని కూడా కరోనా వార్డులో చేర్చారు. వీరి ముక్కు, గొంతు నుంచి తీసుకున్న నమూనాలను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు పంపించారు. రెండు రోజుల్లో వీరి రిపోర్టులు రానున్నాయి.