సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (15:47 IST)

విశాఖ‌లో కరోనా విజృంభ‌ణ... ఇద్ద‌రు అధికారుల‌కు పాజిటివ్!

విశాఖలో కరోనా డేంజర్ బెల్ మరోసారి మోగింది. మూడో వేవ్ ప్రారంభానికి సంకేతంగా, ఇక్క‌డ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. విశాఖ వాసుల‌ను మూడో వేవ్ భ‌య‌కంపితుల్ని చేస్తోంది.
 
 
విశాఖ గ్రేట‌ర్ మున్సిప‌ల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశాకు కరోనా పాజిటివ్ సోకింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుపతిరావుకు మరోసారి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన స్థానంలో డాక్టర్ విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. రోజుల వ్యవధిలోనే  ఇద్దరు అధికారులకు పాజిటివ్ సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ‌లో నిన్న‌ ఒక్కరోజు వ్యవధిలోనే జిల్లాలో 183కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా  విశాఖలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.