గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (17:52 IST)

ఏపీలో కరోనా కట్టడికి ఆంక్షలు మొదలు.. అమలులోకి నైట్ కర్ఫ్యూ

కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏపీకి పక్కనే ఉండే తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సైతం నైట్ కర్ఫ్యూ అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఒకే కర్ఫ్యూ వల్ల కేసుల సంఖ్య తగ్గపోతే లాక్‌డౌన్‌ తప్పదని తెలుస్తోంది
 
తాజాగా కరోనా వైరస్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం (జనవరి 8) నుంచే కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది.
 
మరోవైపు మహరాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేసులు పెరిగితే ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు.