శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (14:16 IST)

ఎస్ఎస్ థమన్‌కి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి సెలెబ్రిటీలను వదిలిపెట్టట్లేదు. నిన్నటి నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా సోకగా, తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌‌కి కరోనా సోకింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌‌లో ఉన్నట్టుగా ట్విట్టర్‌‌లో వెల్లడించాడు. తనని కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. ఇక తమన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీలోని ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు. 
 
అగ్ర సంగీత దర్శకుడు థమన్ సంచలన ఫామ్‌లో ఉన్నాడు. బిజీగా విరామం లేకుండా పనిచేస్తున్నాడు. దక్షిణ భారత టాప్ ప్రాజెక్ట్‌ల కోసం పనిచేస్తున్నాడు.  అతను ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ యొక్క భీమ్లా నాయక్‌పై దృష్టి పెట్టాడు. 
 
ఈ నేపథ్యంలో టాప్ కంపోజర్‌ అయిన థమన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, థమన్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు మరియు పబ్లిక్ ఈవెంట్‌లు మరియు ఫంక్షన్లలో అతను ముసుగుతో కనిపించాడు. అయినా అతనిని కరోనా వదిలిపెట్టలేదు.