శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (10:45 IST)

బీఎస్ఎఫ్‌లో మరో 73 మందికి కరోనా

భద్రతా దళాల్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీఎస్ఎఫ్‌లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా, తాజాగా మరో 73 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది.
 
తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది.

మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్‌లో ఇంకా 178 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి.