కర్నూలు పోలీసుల ఔదార్యం
సంజీవకుమార్ అనే వ్యక్తి ఎ పి 28 BL 1969 అను కారులో ప్రొద్దుటూరు నుండి హైదరబాద్ కు కర్నూలు మీదుగా వెళుతున్నాడు. కర్నూలు, ఓర్వకల్లు సమీపంలోని హుస్సేనాపురం దగ్గర సంజీవకుమార్ కారులో ప్రయాణిస్తూ SR పెట్రోల్ బంకు దగ్గర నిద్ర మత్తులో కల్వర్టు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఈయనకు తలకు, ఎడమకాలుకు గాయం అయినది. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తున్న విద్యార్ది నాడ వినయ్ డయల్ 100 పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ ఒర్వకల్లు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ 2586 ఆంజనేయులు, హోంగార్డు 726 కె. నాగరాజు రోడ్డు ప్రమాద సంఘటన స్ధలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయపడి వెంటనే హైవే అంబులెన్సు ద్వారా వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేందుకు సహాయపడ్డారు.
సత్వరమే స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సహాయపడి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు అభినందించారు.