బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (17:57 IST)

దుర్గా మల్లేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న సీఎస్. స‌మీర్ శ‌ర్మ‌

బెజ‌వాడ‌లోని క‌న‌క దుర్గ‌మ్మ దేవ‌స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు పూజ నిర్వ‌హించారు. అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ద‌ర్శించుకున్నారు. సీ.ఎస్. ప‌ద‌వి అలంక‌రించిన త‌ర్వాత తొలిసారిగా స‌మీర్ శ‌ర్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు.