శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2024 (16:44 IST)

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

jyothula nehru
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ఎంతమాత్రం బాగోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆయన మాటలతో అధికార పక్షంలో విపక్షం స్వరం ఏంటయా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ఐనప్పటికీ జ్యోతుల నెహ్రూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి ఇసుక విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా వుందని అన్నారు.
 
గత ప్రభుత్వం మాదిరిగా ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇసుక చేరేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇసుక వ్యవహారం అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనీ, ఫలితంగా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని అన్నారు. ఇంకా మట్టి గురించి కూడా ఆయన మాట్లాడబోతుండగా... డిప్యూటీ స్పీకర్ రాజు... జ్యోతుల నెహ్రూను కూర్చోవాలంటూ సూచన చేసారు.
 
దాంతో నెహ్రూ మాట్లాడుతూ.. ఈ సభలో నేనే సీనియర్ ఎమ్మెల్యేను. నాకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా.. ప్రతిపక్ష సభ్యులను చూసినట్లు నన్ను చూస్తే ఎలా... అని ప్రశ్నించారు. నన్ను మాట్లాడవద్దని చెప్పడం కంటే సభకు రావద్దంటే రానంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది.