శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (13:14 IST)

దూసుకొస్తోన్న మాండూస్ తుఫాన్.. ఆరు జిల్లాలకు వార్నింగ్

cyclone
మాండూస్ తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీలోని ఆరు జిల్లాలకు వరద ముప్పు తప్పేలా లేదు. తుఫానుపై తాజాగా వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై వుందని.. ఈ తుఫాను కారణంగా ఏపీలోని ఆరు జిల్లాల్లో కోటిమందికి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. 
 
శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని అధికారులు తెలిపారు. 
 
దీని ప్రభావంతో మూడు రోజుల పాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.