ఈసారి పవన్ అభ్యర్థనను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకున్నారా? రీ-నామినేషన్ నిర్ణయం

pawan kalyan
ఐవీఆర్| Last Updated: సోమవారం, 1 మార్చి 2021 (19:49 IST)
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గతంలో గెలుపొందినవారి విషయంలో తిరిగి రీ-నామినేషన్ అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి కొత్తగా అవకాశం కల్పించాలంటూ ఆయన కోరారు.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గతంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ-నామినేషన్‌కి అవకాశం‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో ఎస్ఇసి నిమ్మగడ్డ పేర్కొన్నారు.

ఆయన నిర్ణయంతో కడప జిల్లా రాయచోటిలో 2, పుంగనూరు మున్సిపాలిటీలో 3, తిరుపతి కార్పొరేషన్లో 6 స్థానాలకు రీ-నామినేషన్ అవకాశం కలుగనుంది. అభ్యర్థులు రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు ఆయన అవకాశం కల్పించారు. దీనిపై ఎన్నికైన మున్సిపల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :