సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (19:20 IST)

వడ్డేశ్వరంలో వింత పక్షులు.. పెద్దపెద్ద కళ్లు.. చూడటానికి భయంగొలిపే..?

Birds
తెలుగు రాష్ట్రాల్లో వింత పాములు, జంతువులు, పక్షులు, పెద్దపులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు వాటిని చూసినప్పుడల్లా అవే హాట్ టాపిక్‌గా మారతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరంలో వింత పక్షులు కలకలం రేపాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో తిష్టవేసిన పక్షులు ఎవరైనా దగ్గరికొస్తే బుసలు కొడుతున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. 
 
గుడ్లగూబను పోలిన ఈ పక్షులను చూసి స్థానికులు భయపడుతున్నారు. పెద్దపెద్ద కళ్లతో చూడటానికి భయంగొలిపే రీతిలో ఉన్నాయని చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితమే భవనంలో పక్షులు గూడు కట్టుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వాటి తల్లి రాత్రి సమయంలో వచ్చి వెళ్తుందని చూసినవారు చెప్తున్నారు. 
 
దీనిపై స్పందించిన భవన యజమాని.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు వాటిని తీసుకెళ్లొచ్చని తెలిపారు. పక్షులు చిన్నవిగా ఉండటంతో వాటిని బయటపడేయానికి వెనకాడుతున్నట్లు చెప్పారు. చాలామంది వాటిని గుడ్లగూబ పిల్లలుగానే అనుమానిస్తున్నారు.