బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (10:45 IST)

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయేలా న

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయేలా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా చేసుకుని రెచ్చిపోతున్నారు. 
 
ముఖ్యంగా, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయవద్దని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ సమస్యలను జాతీయ స్థాయి అజెండాగా మార్చామన్నారు. అలాగే ఏపీకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని, దీనిని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలి... రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 
 
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో 6 నెలలపాటు పార్లమెంటులో పోరాటం చేశామని గుర్తుచేశారు. తక్కువ మంది ఎంపీలతోనే ఆనాడు సభను స్తంభింపచేశామని, అన్యాయాన్ని ప్రతిఘటించామన్నారు. మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం.. రాష్ట్రాభివృద్ధే మన లక్ష్యం అంటూ ఆయన పునరుద్ఘాటించారు. ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని, సభ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరూ వినాలన్నారు. అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని, రెండు ప్రభుత్వాల మధ్య సమస్య ఇది అని చెప్పుకొచ్చారు.