శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:07 IST)

వాట్సాప్ లో 'పింక్ లింక్' పేరిట వచ్చే లింకుల బారిన పడి మోసపోవద్దు

ఇటీవలి కాలంలో వాట్సాప్ లో 'పింక్ లింక్' పేరిట వచ్చే మోసపూరిత లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని ప్రజలకు సూచించారు కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్.

ఆన్ లైన్ షాపింగ్, వెబ్ సైట్ల ఆఫర్ అంటూ వాట్సాప్ లో వచ్చే లింకులను క్లిక్ చేస్తే మన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుందని, మీకు తెలియకుండానే మీరు సభ్యులుగా ఉన్న గ్రూపులన్నింటికీ క్షణాల్లో వెళ్ళిపోతుందని, దానిని చూసి మిగతా వాట్సాప్ గ్రూప్ సభ్యులు కూడా క్లిక్ చేస్తే వారు కూడా మోసపోయే అవకాశం ఉందన్నారు 
 
OLX పేరిట జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:
**ఆన్ లైన్ లో OLX లో వస్తువులు తక్కువ ధరకు వస్తుందని ఆశపడి డబ్బులు వేస్తున్నారా ...? అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్టే. గుర్తు తెలియని వ్యక్తి తో మీరు ఫోన్ లో మాట్లాడి డబ్బులను వారి ఖాతాలో వేస్తే  సైబర్ నేరగాళ్ళు మోసాలకు గురౌతారు అని  తెలిపారు.
 
డేటింగ్ వెబ్ సైట్స్ పేరిట జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి:
కాలక్షేపానికి లేదా ఏకాంతంగా ఉండేటప్పుడు మాత్రమే వీక్షించే కొన్ని రకాలైన డేటింగ్ వెబ్ సైట్స్ నే ఎరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్త వహించాలని సూచించారు.

డేటింగ్ వెబ్ సైట్స్ లలో రిజిస్ట్రేషన్ కోసం మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ పై మీకు వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు పరిచయం చేసుకొని  వీడియోను ల్యాప్ టాప్ ద్వారా కానిలేక మొబైల్ ద్వారా కానీ ప్లే చేసి, తరువాత మిమ్మల్ని డబ్బుల కోసం బెదిరించడం మొదలు పెడతారన్నారు.

మీరు డబ్బులు ఇవ్వని ఎదల ఆ వీడియో ను వివిధ సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తారు,  మీరు పరువు కోసమని సైబర్ నేరగాళ్లకు వారు అడిగినంత డబ్బు వేస్తూ వస్తారు.  కాబట్టి డేటింగ్ వెబ్ సైట్స్ ను, ఇలాంటి ఇతర యాప్ లను ఉపయోగించక పోవడం శ్రేయస్కరమని సూచించారు.

అంతే కాకుండా మీరంటే గిట్టని వాళ్ళు మీ యొక్క మొబైల్ నెంబర్ లను డేటింగ్ వెబ్ సైట్స్ లలో ఉంచి మీ పేరు, వివరాలతో మీరు చాట్ చేసినట్టు వారితో చాట్ చేస్తున్న చాలా విషయాలు ఇటీవలి కాలంలో పోలీసు శాఖ దృష్టికి వచ్చాయన్నారు.

➡️ డేటింగ్ వెబ్ సైట్ ల నుండి వచ్చిన లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు.
➡️ అపరిచిత వ్యక్తులకు మీ యొక్క వాట్సాప్ / మెయిల్ ఐ.డి లను షేర్ చేసుకోకండి.
➡️ తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడకండి.
 
*సోషల్ మీడియా లో వచ్చే మెసేజ్ ల ద్వారా  ఫేక్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్స్ బారిన పడి మోసపోవద్దు 
మీరు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో వచ్చే వెబ్ సైట్స్ నందు డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారా! తస్మాత్ జాగ్రత్త ..మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉందని సూచించారు.

ఇటువంటి నేరాల్లో మొదటగా సైబర్ నేరగాళ్లు తమకు సంబంధించిన ఒక వెబ్ సైట్ లింకు నందు ఇన్వెస్ట్ చేస్తే మీకు తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు వస్తాయని, ఏమైనా సందేహాలుంటే ఈ నెంబర్ ను సంప్రదించగలరు.. అంటూ ఒక నెంబర్ ను ఉంచి సదరు వెబ్ సైట్ లో మొదటగా కొంత డబ్బును ఇన్వెస్ట్ చేసిన ఎడల మీకు వాటికి సంబందించిన రిటర్న్స్ మీకు ఇస్తారు అని ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. ఎన్ని రోజులైనా మీకు తిరిగి డబ్బు రాకపోయే సరికి మీరు మోసపోయారని విషయాన్ని గుర్తిస్తారు.
 
**సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇటువంటి ఇన్వెస్ట్ స్కీమ్స్ కు సంబంధించిన వీడియోలను నమ్మకండి.
**తెలియని, పరిచయం లేని వ్యక్తుల ద్వారా డబ్బు పెట్టుబడికి సంబంధించిన స్కీమ్స్ నందు డబ్బులు పెట్టకండి.
**మీకు తెలియని లింకులను క్లిక్ చేయకండి.
 
కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) , మినీ బ్యాంక్ పేరిట జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
**మీకు ఏదైనా ఒక  బ్యాంక్ కు సంబంధించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ కానీ లేక ఆ బ్యాంక్ సంబంధించిన మినీ  బ్యాంక్ ను మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ సంప్రదించండి అంటూ మెసేజ్ లను నమ్మితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం  ఉంది.
 
** తీసుకోవాల్సిన జాగ్రత్తలు ....
 
1. మీకు ఈ విధంగా ఎవరైనా మెసేజ్ పం పినట్లయితే మీరు వాటిని నమ్మకండి.
2. మీకు తెలియని  వ్యక్తుల నుండి వచ్చే సమాచారాన్ని నమ్మకండి.
3. మీకు తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకు లను క్లిక్ చేయకండి , ఫార్వార్డ్ చేయకండి .
 
కావున ప్రజలు  ఇటువంటి సైబర్ నేరగాళ్ళ మాయ మాటలకు లోబడకుండా అప్రమత్తం గా ఉండాలని, అటువంటి నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీకు దగ్గరలో గల పోలీసు స్టేషన్ లో గాని,  లేదా సైబర్ మిత్ర  వాట్సప్ నెం. 9121211100 కు గాని  పిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. 

గమనిక: 
1. మీకు వచ్చే OTP నంబర్ కానీ, కోడ్ అనిగాని, అంతర్జాతీయ నంబర్ అనిగాని అడిగారు అంటే అది మోసమే,
2. లింక్ పంపి క్లిక్ చేస్తే ఫ్రీ, డిస్కౌంట్ అంటే మోసపోయినట్లే, 
3. ఎవరైనా KYC ని UPDATE చేసుకోమని call చేసి వారు చెప్పినట్లు చేస్తే మీరు మోసపోయినట్లే, 
4. మీ మొబైల్, desktop లలో ఏదైనా యాప్ install చెయ్యమని చెప్పినపుడు, మీరు install చేస్తే మోసపోయినట్లే, 
5. జాబ్ కి apply చేసి సెక్యూరిటీ డిపాజిట్ గా amount వెయ్యమని చెప్పినపుడు, మీరు amount వేస్తే మోసపోయినట్లే
6. మీకు తెలియని విషయాలను ఫోన్ లో ఎవరైనా చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ లో కానీ, అనుభవజ్ఞుల చే కానీ, బ్యాంక్ వారిని కాని సంప్రదించవచ్చు