మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:49 IST)

కర్నూలు వెలుగోడులో కలకలం రేపిన జంట హత్యలు

కర్నూలు జిల్లా వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని అనే మహిళ, ఓబులేసు అనే వ్యక్తిని నరికి చంపారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. 
 
అయితే, ఈ క్రమంలోనే అర్థరాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండో భార్య చిన్నిలను కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. మల్లికార్జున రెండో భార్య చిన్నతో ఓబులేసుకు అక్రమ సంబంధం ఉండివుంటుందని అందువల్లే వారద్దరిని చంపివుంటారని పోలీసులు భావిస్తున్నారు.