గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:58 IST)

వేరే వారితో వివాహం.. లేటు వయసులో ప్రేమ జంట ఆత్మహత్య

కర్నూలు జిల్లా శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీశైలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నీలం సంజీవరెడ్డి సత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమ జంట. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఇసప్పాలెంకు చెందిన నాగలక్ష్మి (48) మృతి భర్త, వెంకట కాళేశ్వర రావు (50) గా గుర్తించారు పోలీసులు.
 
ఆత్మహత్యాయత్నం చేసిన వారినే సున్నిపెంట ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారిలోనే మృతి చెందారు. ఇద్దరికీ వేరే వారితో వివాహం కాగా పెళ్లి కాక ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు వారితో పెళ్లయిన తరువాత విడిపోయింది ఈ ప్రేమ జంట. 
 
ఈ మధ్యనే ఇద్దరు కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే కలసి జీవించలేమని ఆత్మహత్యకు పాల్పడ్డారు నాగలక్ష్మి, వెంకట కాళేశ్వర్ రావు. ఇక ఈ ఆత్మహత్యపై బంధువులకు సమాచారమిచ్చారు పోలీసులు.