బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:43 IST)

ఆటో కొన్న‌ది కిరాయి కోసం కాదు... చోరీల‌ కోసం!

ఎవ‌రైనా ఆటో కొంటే... దాన్ని కిరాయికి తిప్పి నాలుగు డ‌బ్బులు సంపాదించాల‌నుకుంటారు. కానీ, ఈ చోరాగ్రేస‌రుడు త‌న సొంత ఆటోలో తిరుగుతూ, రాత్రిపూట చోరీల‌కు పాల్ప‌డుతుంటాడు. ఇలా చోర వృత్తిని హాబీగా ఎంచుకున్న ఆ చోరుడిని తిరుప‌తి పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కర్నూలులోని అశోక్ నగర్ కు చెందిన కె. వంశీకృష్ణ (28)ను ప‌లు చోరీ కేసుల్లో తిరుప‌తి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి నాలుగు లక్షల విలువ గల ఆపిల్ ల్యాబ్ టాప్, ద్విచక్ర వాహనం, ఆటో, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణ ఇలా ఆటోలో తిరుగుతూ, ప‌లు చోరీలు చేశాడు. 2016లో కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇత‌నిపై సెల్ షాప్ చోరీ కేసు న‌మోదు అయింది. ఆ త‌ర్వాత 2018లో నందికొట్కూరులోని స్టూడియోలో కెమెరా చోరీ చేశాడు. 2019లో గద్వాల్ సెల్ ఫోన్ షాప్ లో చోరీ చేశాడు.
 
2020లో కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ లో ద్విచక్ర వాహనం చోరీ కేసు న‌మోదయింది. 2021లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్ లో మ‌రో ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. కర్నూలు నుండి సొంత ఆటోలో తిరుగుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న‌ట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కేసు ఈస్ట్ ఎస్ ఐ నాగేశ్వరరావు ద‌ర్యాప్తు చేశారు.