గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:34 IST)

ఏపీలో భూప్రకంపనలు, కాకినాడ కదిలిందా?

బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1 గా నమోదయింది. ఈ నేపథ్యంలోలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 
 
భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు – ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
 
ఈ మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో భూమి కి పది కిలోమీటర్ల నూతన భూమి కన్పించిందని వివరించింది. అటు ఏపీ లోని కాకినాడకు దక్షిణ మరియు ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రి కి దక్షిణాన మరియు ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 
 
ఇక ఈ భూకంప ప్రభావంతో చెన్నై లోని పలు ప్రాంతాల్లో ప్రజలు… ఇల్లు, ఆఫీస్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇది భూకంపం మాత్రమేనని.. ఎలాంటి సునామీ హెచ్చరిక లు లేవని పేర్కొంది.