బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (18:32 IST)

పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్.. ముగ్గురు రైతులు మృతి

ఏపీలోని కడప జిల్లాలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా ముగ్గురు రైతులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ముందుగా ఒక రైతు పిచికారి చేస్తుండగా అతడికి కరెంట్‌ షాక్ తగిలింది. 
 
అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి కూడా షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.