సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (15:34 IST)

అంగన్వాడీలపై ఎస్మా చట్టం.. అయినా వెనక్కి తగ్గేదిలేదు..

jagan
ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేదిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
 
కాగా జనవరి ఐదో తేదీ లోపు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వేతనాల పెంపు, గ్రాట్యూటీపై స్పష్టత వచ్చే వరకూ విధుల్లో చేరబోమని అంగన్వాడీలు గత 26 రోజులుగా ధర్నా చేస్తున్నారు.