ఏపీ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
ఏపీ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులు అయిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 21 అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో భాగంగా మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్-9, డీఎస్పీ-26 పోస్టులు ఉన్నాయి.
అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జనవరి 10గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు డిగ్రీ ఆపైన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు