శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (19:20 IST)

ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉపసంఘం ఏర్పాటు

రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి విధానాలను రూపొందించేందుకు గాను మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులు సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పినిపే విశ్వరూప్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

పేదలు, న్యాయవాదులు, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే ఇళ్లస్థలాలపై ఉపసంఘం సమగ్ర అధ్యయనం చేయనుంది. వీరికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది.