గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (08:54 IST)

తుది మెరుగులలో కొత్త పారిశ్రామిక విధానం: మంత్రి గౌతమ్ రెడ్డి

అన్ని రంగాలకు ప్రాధాన్యం ఉండే సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం కోసం పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి తుది  కసరత్తులో నిమగ్నమయ్యారు.

సచివాలయంలోని నాలుగవ బ్లాక్, మొదటి అంతస్తులో ఉన్న సమావేశమందిరంలో పరిశ్రమల శాఖ అధికారులతో ‘ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ & ఎక్స్ పోర్ట్  ప్రమోషన్ పాలసీ 2020-2025’పై సమీక్షా సమావేశం  నిర్వహించారు.

ఉపాధి, సాంకేతికత పెంపు, పర్యావరణహిత,ఆదాయ వంటి అంశాల సమ్మిళతంగా కొత్త పాలసీని తీసుకురావడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. 

కొత్త పారిశ్రామిక విధానంలో  కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరిన తరుణంలో మంత్రి గౌతమ్ రెడ్డి పెట్టుబడులు ఆకర్షించే అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదంతో విడుదల కాబోయే కొత్త పాలసీ విధానంపై ప్రజల్లో ఎన్నో అంచనాలున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఆ అంచనాలను అందుకునేలా పాలసీని తీర్చిదిద్ది ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి సర్వం సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ముందు ఈడీబీ బోర్డు సమావేశం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్షా సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.