ఈ-మార్కెటింగ్‌పై దృష్టి సారించండి: జగన్‌

jagan
ఎం| Last Updated: శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:04 IST)
నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడద‌ని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదు అని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై సీఎం జగన్ శుక్ర‌వారం సమీక్ష నిర్వ‌హించారు.

సమావేశంలో సీఎం మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదు, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదు.
ప్రతీ పంట కూడా ఆర్‌బీకే నుంచి ప్రొక్యూర్‌ చేయాలి. పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలి. ప్రతీ ఆర్‌బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలి.

భవిష్యత్తులో ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్‌ఫోర్స్‌ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా చూడాలి.

వీటన్నింటినీ జాయింట్‌ కలక్టర్లు చూడాలి. వారు రైతులకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. వాటర్‌ రియాలిటీ, మార్కెట్‌ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆ తర్వాత పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, లోకల్‌ ఎమ్మెల్యేలను కూడా ఇన్‌వాల్వ్‌ చేయాలి. ర్టెక్స్‌ వెరైటీని ప్రమోట్‌ చేయాలి.

బ్రొకెన్‌రైస్‌ను కూడా వాల్యూ ఎడిషన్‌ చేయాలి. కాటన్‌ కొనుగోళ్ళలో స్కామ్‌లు జరగకూడదు, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపండి. పత్తి రైతులకు న్యాయం జరగాలి. మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్‌ పోగొట్టుకోకూడదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూసి ఏర్పాటు చేయండి.

ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టాలి. బహిరంగ మార్కెట్‌లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలి. తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్‌ సదుపాయం కలిగేలా చూడాలి. ఆ విధాంగా రైతులకు మేలు చేయాలి. ఈ సీజన్‌లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలి.

ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశాం. ప్ర‌తీ పంట కూడా ఆర్‌బీకే నుంచి ప్రొక్యూర్‌ చేయాలి. పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలి. ప్రతీ ఆర్‌బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్‌ఫోర్స్‌ చేయాలి.

ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చె ప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా చూడాలి. వీటన్నింటినీ జాయింట్‌ కలక్టర్లు చూడాలి. వారు రైతులకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. వాటర్‌ రియాలిటీ, మార్కెట్‌ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి.

ఆ తర్వాత పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, లోకల్‌ ఎమ్మెల్యేలను కూడా ఇన్‌వాల్వ్‌ చేయాలి. సార్టెక్స్‌ వెరైటీని ప్రమోట్‌ చేయాలి. బ్రొకెన్‌రైస్‌ను కూడా వాల్యూ ఎడిషన్‌ చేయాలి. కాటన్‌ కొనుగోళ్ళలో స్కామ్‌లు జరగకూడదు, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపండి.

పత్తి రైతులకు న్యాయం జరగాలి. మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్‌ పోగొట్టుకోకూడదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూసి ఏర్పాటు చేయండి. ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టాలి.
బహిరంగ మార్కెట్‌లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలి.

తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్‌ సదుపాయం కలిగేలా చూడాలి. ఆ విధాంగా రైతులకు మేలు చేయాలి. ఈ సీజన్‌లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలి. ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశాం.దీనిపై మరింత చదవండి :