సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:24 IST)

భూములు ఇచ్చిన పాపానికి...సంకెళ్ళు వేస్తారా?: అమరావతి పరిరక్షణ సమితి

రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి రైతన్నలకు సంకెళ్ళు వేసి కోర్టుల చుట్టు తిప్పుతూ ధృతరాష్ట్రుడు పాలన సాగించడము కాదా అని సిఎం జగన్మోహన్ రెడ్డిని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి ప్రశ్నించారు.

విజయవాడ అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ రాష్ట్ర కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ.. కరుడుగట్టిన నేరస్తుల్లా రైతుల చేతికి పోలీసులు బేడీలు వేయడాన్ని జెఏసీ తీవ్రంగా ఖండిస్తుందని తగిన మ్యూలం ప్రభుత్వం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నీరంకుశ పాలనలో ఉన్నామా అనేది ఆలోచన చేయాలన్నారు. 315 రోజులుగా అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే బ్రిటిష్ పాలన కంటే ఈ ప్రభుత్వం అనాగరికంగా పాలిస్తుందన్నారు.

మూడు రాజధానిలు కోసం ఎక్కడ నుండో కూలీలు మాదిరిగా వచ్చి మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఒకసారి అమరావతిలో దృశ్చర్యలను చూడాలని..ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

పిర్యాదు చేసిన రవి కుమార్ కాంప్లెట్ వెనుకకు తీసుకుంటానని చెప్పినా పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని, పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలి తప్ప ప్రభుత్వాలలకు గులాంగిరి చేయకూడదని సూచించారు. భవిష్యత్ లో ఇటువంటి చర్యలకు మరోసారి పాల్పడే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
 
అమరావతి బహుజన జెఏసీ కన్వీనర్, దళిళ రైతు బాలకోటయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకొక్కరి పై దాడి చేసుకుంటూ వెళుతున్నారని ప్రభుత్వం అమరావతిలో దామనకండకు పాల్పడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఒక ఎస్సీ వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తొలిసారిగా వైకాపా ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని, కుఏలమతాలకు అతీతంగా అరాచకత్వం సాగిస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యము గొడ్డలి పట్టుకొని తిరుగుతుందన్నారు.

దమ్ముంటే మూడు రాజధానిలు ఎజెండాతో ఎలక్షన్స్ వెళ్ళండి అని సవాల్ విసిరారు. బేడీలు వేసింది మీరే క్రిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీ పాలనను సరిచేసుకోవాలి బేషరతుగా రైతులకు సిఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
జెఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ పోలీసులు అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం అన్యాయమని, ఇప్పటికే ఎన్నో తప్పుడు కేసులు బనాయించారని అటువంటి అధికారులపై కేసులు పెట్టబోతున్నామన్నారు.

రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నం పెట్టే రైతులకు సంకెళ్ళు వేస్తారా అని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్ళువేసి అవమాన పరిచనందుకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
ఈ నెల 29 నుండి 3 రోజులు నిరసన కార్యక్రమాలు
29 న రాష్ట్రంలో అన్ని మండల, తాలుకా, కలెక్టర్ కార్యాలయంలు ముందు నిరసనలు,30 న నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు వ్యక్తం చేయడం,31 చలో గుంటూరు జైలు కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.