ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (12:54 IST)

బీజేపీలో చేరనున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

kiran kumar reddy
kiran kumar reddy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణ బీజేపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోషించనున్నారని సమాచారం. అంతేగాకుండా జాతీయ స్థాయిలో ఆయనకు కీలక పదవిని అప్పగిస్తారని టాక్. తన రాజకీయ జీవితాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించి, చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 
 
ముఖ్యమంత్రి పదవితో పాటు పలు బాధ్యతలను నిర్వహించారు. ఏపీ విభజనను సీఎంగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో, ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 
 
సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ వస్తోంది.