శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (11:18 IST)

గుండ్రాయిలా ఉన్నారు? ఏపీలో అల్లుడు వైద్యంపై నమ్మకం లేదా?

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనిపై విపక్ష టీడీపీ నేతలు తమకు తోసినవిధంగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని ఘోరంగా అవమానించారని.. అసలు విజయసాయిరెడ్డి మనిషేనా? అంటూ మండిపడ్డారు. 'విజయసాయి రెడ్డి మనిషేనా? ఒక బీసీ నాయకుడిని ఘోరంగా అవమానించారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రి కావాలా? ఈఎస్ఐ వద్దా' అంటూ ట్వీట్లు పెట్టి సాయిరెడ్డి హింసించారు. 
 
మరి ఇప్పుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగానే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయారు? వైకాపా నాయకులకు హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యమా? ప్రజాలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా? గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కేజీ హెచ్‌లో ఎందుకు చేరలేదు? ఏపీలో అల్లుడు వైద్యం మీద నమ్మకం లేదా?' అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.