సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (08:39 IST)

ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జిలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నలుగురిలో ఆర్‌.రఘునందనరావు, బట్టు దేవానంద్‌, డి.రమేశ్‌, ఎన్‌.జయసూర్య ఉన్నారు.

న్యాయవాదుల కోటా నుంచి ఏపీ హైకోర్టుకు నలుగురిని, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురిని సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్రానికి లేఖ పంపింది. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా టి.వినోద్‌కుమార్‌, ఎ.అభిషేక్‌ రెడ్డి, కె.లక్ష్మణ్‌ పేర్లు సూచించారు.