గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:25 IST)

కర్నూలు జిల్లాలో గుప్త నిధులు పేరిట మోసం

కర్నూలు జిల్లాలో గుప్తనిధులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ అమాయకుడి నుంచి రూ.13.5లక్షలు టఓకరా వేసిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు అనే వ్యాపారి వద్దకు 2017లో కొందరు వ్యక్తులు వచ్చి గుప్తనిధులు ఇప్పిస్తామని నమ్మబలికారు. కొత్తపల్లి మండలంలోని ఓ పొలంలో  నిధిని బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉందని, అందుకు కొంత సొమ్ము ఖర్చవుతోందని చెప్పారు.

గుప్తనిధులపై అత్యాశతో శ్రీనివాసులు కొంత మొత్తం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు అవసరం ఉందని ఆ వ్యక్తులు పలుమార్లు వ్యాపారి నుంచి సుమారు రూ.13.5 లక్షల వరకు వసూలు చేశారు. అంతడబ్బు తనవద్ద లేకున్నప్పటికీ గుప్తనిధుల కోసం అప్పుచేసి మరీ వారికి సొమ్ము ఇచ్చారు.

మూడేళ్లు దాటినా గుప్తనిధులు ఇవ్వకపోగా.. సొమ్మును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనను బెదిరించారని బాధితుడు శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు.