సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:05 IST)

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

gas cylinder boy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్ షురూ అయిన విషయం తెల్సిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇలా ప్రతి యేటా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందజేయనుంది. ఆధార్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడుకీ ఈ ఉచిత సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
వినియోగదారుడు డబ్బు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు థాకాకు నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.851 రాయితీని ఇవ్వనుంది. ఈ సొమ్మును ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.