గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:37 IST)

వివాహ వేడుకలకు 150 మందికి మాత్రమే.. ఏపీ సర్కారు

ఏపీలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివాహ వేడుకలకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహాలతో పాటు ఏదైనా ఫంక్షన్లు, ప్రార్థనలు ఏదైనా సరే 150 మందికి మించి గుమికూడవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
కరోనా నిబంధనలు విధిగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. సినిమా థియేటర్లలో సీటు మార్చి సీటు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. 
 
తాజా నిబంధనలను జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.