శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (06:31 IST)

విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మెట్రో రైల్‌ మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. మెట్రో రైల్‌ మోడళ్లను అధికారులు సీఎం జగన్‌కు చూపించారు.

2020-24 మధ్య మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మంచి నిర్మాణశైలిని ఎంపిక చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కోచ్‌ల నుంచి స్టేసన్ల నిర్మాణం వరకూ అత్యుత్తమ విధానాలను పాటించాలన్నారు. ముంబై మెట్రో పిల్లర్‌ డిజైన్‌ను పరిశీలించాలని సూచించారు. ప్రతి స్టేషన్‌ వద్ద, ప్రధాన జంక్షన్‌ వద్ద పార్కింగ్‌కు స్థలాలుండాలన్నారు.
 
రేపు కియ ప్లాంటు ప్రారంభం
అనంతపురం జిల్లాలో స్థాపించిన కియ మోటార్స్‌ ప్లాంటును గురువారం సీఎం ప్రారంభించనున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంటును అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన కార్లు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నాయి.

అయితే జగన్‌ ఈనెల ఐదో తేదీన దీనిని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో కియ ప్లాంటుకు వెళ్తారు. చంద్రబాబు టెస్ట్‌ ట్రయల్‌ చేశారని, ఇప్పుడు పూర్తిగా ప్లాంటు నిర్మాణం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు.