మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (06:09 IST)

అందుకే మోడీ, అమిత్ షాలకు పవన్ భజన: కొడాలి నాని

జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు జనసేనాని పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

తిరుపతి న్యాయవాదుల సభలో పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలకు మోడీ, అమిత్ షాలే కరెక్ట్ అని వ్యాఖ్యానించడంపై నాని స్పందిస్తూ,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగడడం, మద్దతు ఇవ్వడం ద్వారా జనసేనను బీజేపీలో విలీనం చేస్తామన్న సంకేతాలిచ్చారని అన్నారు. జనసేన పార్టీని విలీనం చేయమని గతంలో అమిత్ షా అడిగితే ‘చేయను’ అని పవన్ కల్యాణే బహిరంగంగా చెప్పారని నాని గుర్తుచేశారు.

ఇప్పుడు అమిత్ షా లాంటి నాయకులు అవసరమని పవన్ చెబుతున్నారంటే, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌కు వస్తున్న పేరు చూసి ఏడ్వొద్దని మంత్రి కొడాలి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ గుర్తించకుంటే జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని ఎద్దేవా చేశారు. పవన్‌ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, చంద్రబాబు ‘తానా’ అంటే పవన్ కల్యాణ్ ‘తందానా’ అంటున్నారని ఫైర్ అయ్యారు.

తమ ప్రభుత్వాన్ని గుర్తించడానికి పవన్ ఎవరు?  అంటూ అసలు పవన్ కల్యాణ్ ను ప్రజలే గుర్తించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటన గురించి మాట్లాడుతూ, మోసపోయామన్న బాధతోనే రైతులు దాడి చేశారని అన్నారు. తమకు దాడి చేసే ఉద్దేశ్యం ఉంటే కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబుపై దాడి చేయలేమా అని ప్రశ్నించారు.

దాడులు చేసే సంస్కృతి తమ పార్టీది కాదని అన్నారు నాని. దేశంలో ఉల్లి రూ.100 ఉంటే, ఏపీలో మాత్రం రూ.25 ఉందన్నారు. రాజధాని రైతులను చంద్రబాబు కబుర్లతో చంద్రబాబు మోసం చేశారన్నారు. ఉనికి చాటుకోవడం కోసమే చంద్రబాబు కామెంట్‌ చేస్తున్నారన్నారు.
 
పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనల్లో వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్, మంత్రులపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా మరోసారి పవన్‌ను.. పవన్ నాయుడు అని నాని సంబోంధిచారు.

‘పవన్‌నాయుడు మమ్మల్ని గుర్తించాలని మేం ఏడ్వడంలేదు. ప్రజలు మమ్మల్ని గుర్తించారు, మిమ్మల్ని గుర్తించలేదు. అమిత్‌ షా కరెక్ట్‌ అంటే జనసేనను బీజేపీలో కలిపేయడమనేనా?. విలీనం చేసే ఆలోచన ఉంది కాబట్టే అమిత్‌షాను పొగిడారు. పవన్‌ సినిమాల్లో నిర్మాతలకు, రాజకీయాల్లో బాబుకు డేట్లు ఇస్తారు.

మంత్రుల మాటల వల్లే దిశలాంటి సంఘటనలు జరిగాయా? పవన్‌ కల్యాణ్‌ నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నారు. దాన్ని జనాలు ఎందుకు తప్పుగా తీసుకోరు? స్త్రీ అంటే విలువలేని వస్తువులుగా పవన్ భావించడం వల్లే సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’ అని పవన్‌పై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.