మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (17:39 IST)

ఆరేళ్ల తర్వాత గర్భం.. తప్పు చేశావని.. ఇంటి నుంచి గెంటేశారు..

వివాహమైన ఆరేళ్లకు సంతానం కలుగలేదు. ఆపై లేకలేక భార్య గర్భం దాల్చింది. ఈ శుభవార్తను విని సంతోషించాల్సింపోయి.. భర్త భార్యను ఇంటి నుంచి తరిమికొట్టిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. వివాహమైన ఆర

వివాహమైన ఆరేళ్లకు సంతానం కలుగలేదు. ఆపై లేకలేక భార్య గర్భం దాల్చింది. ఈ శుభవార్తను విని సంతోషించాల్సింపోయి.. భర్త భార్యను ఇంటి నుంచి తరిమికొట్టిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. వివాహమైన ఆరేళ్ల తర్వాత గర్భం ఎలా వచ్చిందని అడుగుతూ.. నిండు చూలాలని కూడా చూడకుండా భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. గూడూరు, గాంధీ నగర్‌కు చెందిన ఖాదర్ బాషా, అనూ బేగంలకు షబీరా, దిల్ షాద్ అనే కుమార్తెలు. కానీ తల్లిదండ్రుల మరణం తరువాత సోదరి దిల్ షాద్‌కు స్నేహితుల సాయంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించింది షబీరా. ఆపై వారికి పిల్లలు కలగక పోవడంతో భర్త రఫీ, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో, ఇన్ని సంవత్సరాలు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందని నిలదీస్తూ, తప్పు చేశావంటూ, ఆమెను శారీరకంగా హింసించడం ప్రారంభించారు. 
 
మూడు రోజుల క్రితం ఆమెను కొట్టి ఇంటి నుంచి తరిమి వేయడంతో డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వస్తూ స్పృహ కోల్పోయింది. ఆమె స్థితిని గమనించిన బీట్ పోలీసులు, ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు తల్లీ, బిడ్డా క్షేమమని చెప్పగా, తన సోదరికి న్యాయం చేయాలంటూ షబ్బీరా పోలీసులను వేడుకుంటోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకుని గర్భవతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.