శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (18:48 IST)

అక్రమ కేసులతో వేధిస్తున్నారు: అఖిల ప్రియ

తనపై, తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​​కు ఫిర్యాదు చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆమె.. తమపై పెట్టిన కేసుల గురించి ఆయనకు వివరించారు.

తప్పుడు కేసులు అనడానికి గల ఆధారాలనూ గవర్నర్​కు అందజేసినట్లు అఖిలప్రియ వెల్లడించారు. వీటిని​ క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్​ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒక్క ఆళ్లగడ్డలోనే తెదేపా సానుభూతిపరులపై 40కి పైగా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె వెంట తెదేపా నేతలు కేశినేని నాని, నిమ్మల రామానాయుడు, మద్దాల గిరి, వర్ల రామయ్య ఉన్నారు.
 
ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్‌
రాష్ట్రంలో ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్‌ విడుదల చేయనుంది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీనే కారణమని ఆరోపించింది. వివిధ జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాలో నేతల ప్రమేయంపై తెదేపా ఛార్జిషీట్‌ రూపొందించింది.

రాష్ట్రంలో.... అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలుగుదేశం ఛార్జిషీట్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో 67 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులు, వాటి కుటుంబ సభ్యులు ఇసుకదందాలు చేస్తున్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు.

ఇసుక కృత్రిమ కొరత సృష్టించడం వల్లే.. రాష్ట్రంలో అందుబాటులో లేదని.. ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ నెల 14న చంద్రబాబు చేపట్టిన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు.