శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (08:16 IST)

ఎక్కడైనా రేట్లు పెంచారా..? ఒక్క కాల్ చేస్తే చాలు!

కరోనా ఎఫెక్ట్‌తో.. దేశవ్యాప్తంగా వచ్చే నెల 14వ తేదీవరకూ లాక్‌‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకుల కోసం జనాలు ఒక్కసారిగా షాపుల ముందు బారులు తీరారు. దీంతో గుంపులు గుంపులుగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఉందని వాటిని కూడా బంద్ చేసింది ప్రభుత్వం. దానికి ఓ సపరేట్ సమయాన్ని కూడా కేటాయించింది.

ఇలాంటి సమయంలో కూడా కొందరు స్వార్థబుద్దిని చూపిస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని రేట్లన్నీ అమాంతం పెంచేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. మీకు ఇష్టమైతే కొనండి.. లేకపోతే లేదంటూ జులుం చేస్తుంటారు. దీంతో సామాన్య జనం జేబులు ఖాళీ అవుతున్నాయి.
 
ఇప్పుడు ఇలాంటి సమస్య లేకుండా.. ఏపీ ప్రభుత్వం మరో డెసిషన్ తీసుకుంది. ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

టోల్ ఫ్రీ నెంబర్: 1967, వాట్సాప్ నెంబర్: 73307 74444 కేటాయించింది. ఈ నెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేయనుంది. రేట్లు పెంచిన యజమానుల వివరాలు, షాపు పేరు చెబితే చాలు. వాళ్ల వివరాలు నమోదు చేసుకుని.. ఆ తర్వాత వాళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు.
 
లాక్‌డౌన్‌తో ధరలు పెంచారని.. పోనీలే అని ఊరికోకుండా.. 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా.. మీ డబ్బుతో పాటు.. పలువురి సామాన్య ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది.