శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (07:45 IST)

కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 14 వరకూ ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది.

కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది.

ఈ వైరస్‌కు విరుగుడు కనుగోనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌట్‌ను కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.