పిహెచ్‌డి చేసాడు, కరోనావైరస్ దెబ్బకు ఇటుకరాళ్లు మోస్తున్నాడు
కరోనావైరస్ వచ్చి అందరి జీవితాలను తారుమారు చేసేసింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం లేకుండా పట్టణంలో ఉండలేక పల్లెటూరుకు తరలివెళ్లారు. అయితే.. అక్కడ కూడా సరైన ఉద్యోగం లేక కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలనుకున్నా చదువుకు తగ్గ పనులు దొరకడం లేదు. ఇలాంటి సంఘటన కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వారు పల్లెలో జరిగింది.
అతను పీహెచ్‌డీ చదివాడు. అంతేకాదు... సాహిత్యంతో మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో పుస్తకాలు కూడా రాసాడు. కలం పట్టిన ఆ చేతులు ఇప్పుడు కొడవలి, పారా పట్టుకుని కూలీ పని చేస్తున్నాయి. చదువుకున్నవాడు అంటే... పని ఇవ్వరని వేలి ముద్రగాణ్ణి అని అబద్ధం చెప్పి కూలి పని చేస్తున్నాడు. ఎవరైనా చూస్తారేమో అని ఒక దొంగలా కూలీ పని చేస్తున్నాడు.
నలభై ఏళ్ల వయసులో ఇంత చదువు చదివినా, అతను కళ్లు తుడుపుకుంటూ కూలీ పని చేసుకురావాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం సిమెంట్ పని చేసుకుని బతుకుతున్నాడు. ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకుని... వారి చదువుకు తగ్గ ఉద్యోగాన్ని ఇస్తే.. మరింత మందికి స్పూర్తిగా నిలుస్తారు. అలా జరగాలని, ఇతనికి మంచి రోజులు రావాలని కోరుకుందాం.