నాగార్జున సాగర్‌ డ్యామ్‌ కు భారీ వరద

nagarjuna sagar dam
ఎం| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:57 IST)
ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుండి 4,25,726 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటంతో సాగర్‌ డ్యామ్‌ 18 క్రష్ట్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,88,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 589.20 అడుగుల వద్ద నీరు నిల్వ వుంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ లు. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం 309.6546 టీఎంసి లు. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని చేపడుతూ 28,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాల్వద్వారా 7978 క్యూసెక్కుల నీటిని, మొత్తం 4,25,726 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టు 5,52,008 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.దీనితో డ్యామ్‌ 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,25,726 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీనితో రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నిటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.00 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.
దీనిపై మరింత చదవండి :