గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (10:22 IST)

జీవోలను వెబ్​సైట్​లో ఉంచకపోవడంపై కౌంటర్!

ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ, దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాలకు సంబంధించి వారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసి ఆ దస్త్రాన్ని పిటిషనర్లకు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
 
 
ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాలకు సంబంధించి వారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానంగా మరో వారంలో కౌంటర్ వేయాలని పిటిషనర్లకు సూచించింది.  విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
 
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. 'జీవోఐఆర్ ' వెబ్ సైట్ ల్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం, మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈగెజిట్ వెబ్ సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7 న జారీ చేసిన జీవో 100 ను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా... కౌంటర్ దాఖలు చేసి ఆ దస్త్రాన్ని పిటిషనర్లకు అందజేయడానికి సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.