బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (11:51 IST)

చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ - ముగ్గురి మృతి

తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు, పోలీసుల మ‌ధ్య జరిగిన కాల్పుల్లో ఈ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘ‌ట‌న ములుగు-బీజాపూర్ అట‌వీప్రాంతంలో చోటు చేసుకుంది.
 
ఈ ఎదురు కాల్పుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దులో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.