కళ్లముందే ప్రియుడితో సల్లాపాలు.. చూసి జీర్ణించుకోలేక భర్త సూసైడ్

suicide
సందీప్| Last Updated: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:04 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడి వివాహేతర సంబంధం కొనసాగించిన భార్యను చూసి జీర్ణించుకోలేక ఓ వ్యక్తి చేసుకున్నాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రొళ్ల వడ్రహట్టి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప కుమారుడు పీజీ నాగరాజు (28)కు అదే గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన యేడాది వరకూ ఎలాంటి గొడవలూ లేకుండా సాఫీగా సంసారాన్ని సాగించారు.

కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన హెచ్‌. నాగరాజు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇంకా అతనితో
సన్నిహితంగా మెలగసాగింది. క్రమేపి అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. ఈ విషయంగా భార్యాభర్తలిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. మాట వినకపోవడంతో విసిగిపోయాడు. గత గురువారం భార్య ప్రియుడు హెచ్ నాగరాజుతో కలిసి ఉండటాన్ని అతడు చూశాడు. భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు.

మూడు రోజుల నుండి వెతుకుతున్నా ఆచూకీ తేలలేదు. చివరికి ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహాన్ని చూసి చలించిపోయిన తండ్రి హనుమంతరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.దీనిపై మరింత చదవండి :